'నగర సుందరీకరణ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి' - Warangal Urban District Latest News
వరంగల్ నగర సుందరీకరణ అభివృద్ధి పనులను కమిషనర్ పమేలా సత్పతి పరిశీలించారు. నిర్మాణాల్లో వేగం పెంచాలని ఆదేశించారు. నర్సరీలకు ఫెన్సింగ్, తోరణం త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు.
వరంగల్ నగర సుందరీకరణలో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి ఆదేశించారు. ప్రొఫెసర్ జయశంకర్ పార్క్, సరిగమపదనిస వనం, వడ్డేపల్లి, భద్రకాళి బండ్ సుందరికరణ నిర్మాణాల పురోగతిని పరిశీలించారు.
కుడా ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ పార్క్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న రాక్ క్లైబింగ్, కలరింగ్ సుందరీకరణ తక్షణమే పూర్తి కావాలని అధికారులను అదేశించారు. పద్మాక్షి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సరిగమపదనిస ఉద్యానవనంలో శిల్ప నిర్మాణంపై ఆరా తీశారు.
వడ్డేపల్లి బండ్ సుందరికరణ పనులను, దానిపై ఏర్పాటు చేసిన రాశి వనాన్ని పరిశీలించి సమర్ధవంతమైన నిర్వహణకు పలు సూచనలు చేశారు. నర్సరీలకు ఫెన్సింగ్, తోరణం త్వరగా ఏర్పాటు చేయాలన్నారు.
ఇదీ చూడండి: కార్పొరేట్ కొలువు వదిలి... సేంద్రియ సాగు వైపు..