ETV Bharat / state

Warangal Central Jail : నేను పుట్టిన చోటు.. ఎందరికో వెలుగునివ్వబోతోంది!

135 ఏళ్ల చరిత్ర నాది. ఎందరో కరుడు గట్టిన నేరస్థులు.. మరెందరో ప్రజా నాయకులు నా వద్ద తమ జీవితం గడిపారు. నా నుంచి ఎవరూ తప్పించుకోవడానికి వీళ్లేని భారీ భద్రత ఉంటుంది. నా దగ్గరికి వచ్చిన ఖైదీలు తయారు చేసే తివాచీలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. 54.5 ఎకరాల్లో విస్తరించిన ఉన్న నేను శిథిలావస్థకు చేరాను. నా వల్ల ఎవరికీ ప్రమాదం జరగకూడదని ఈరోజు మట్టిలో కలుస్తున్నాను. నేను మట్టికలిసిన ఈ చోటు.. రేపు.. ఎందరో రోగుల జీవితాల్లో వెలుగునింపబోతోందని తెలిసి ఆనందంగా విశ్రమిస్తున్నాను. - వరంగల్ కేంద్ర కారాగారం(Warangal Central Jail)

warangal central jail, warangal central jail demolition
వరంగల్ కేంద్ర కారాగారం, వరంగల్ కేంద్ర కారాగారం కూల్చివేత
author img

By

Published : Jun 14, 2021, 2:04 PM IST

Updated : Jun 14, 2021, 2:46 PM IST

వరంగల్‌కు తలమానికంగా నిలిచిన కేంద్ర కారాగారం(Warangal Central Jail) కాలగర్భంలో కలిసిపోయింది. 135 ఏళ్ల చరిత్ర కలిగిన జైలు గోడలు బద్దలయ్యాయి. భారీ భద్రత నడుమ లోపలికి ఎవ్వరిని వెళ్లనీయకుండా జైలు కూల్చివేతలు చేప్టటారు. ములుగు రోడ్డు నుంచి ఎంజీఎం వరకు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి చకచకా జైలు గోడలను కూల్చివేశారు.

54.5 ఎకరాల విస్తీర్ణంలో..

54.5 ఎకరాల విస్తీర్ణంలో ఆరో నిజామ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ హయాంలో నిర్మించిన ఈ వరంగల్‌ కేంద్రగారానికి(Warangal Central Jail) ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ జైలులో నేసిన తివాచీలు ప్రపంచ ప్రఖ్యాతిని గాంచాయి. వరంగల్ సెంట్రల్ జైలు జంప్ఖానా (కార్పెట్)లకు పెట్టింది పేరు. ఇక్కడి ఖైదీలు నేసిన జంప్ఖానాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. పీపుల్స్ వార్ వ్యవస్థాపకులైన కాసూ సన్యాల్​తో పాటు కాళోజి, దాశరధి, వీవీ, మావోయిస్టు అగ్రనేత గణపతి లాంటి ఎందరో ఈ జైలు జీవితం గడపిన వారే. రాష్ట్రంలో ఏ ఇతర జైల్లోనైనా ఖైదీల నుంచి ముప్పు లేదా తప్పించుకొని వెళ్లే ప్రమాదం ఉన్న వాళ్లను ఆయా జైళ్ల నుంచి సురక్షిత ప్రాంతమైన వరంగల్ జైలుకు తరలించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

1885లో పుట్టాను..

1885 లో వరంగల్ సెంట్రల్ జైలు (కేంద్ర కారాగారం(Warangal Central Jail)) నిర్మాణం జరిగింది. పదిహేను సంవత్సరాల క్రితం వరకు నాటి కట్టడ ప్రతిరూపంగా ఉన్న జైలు ముఖ ద్వారం స్థానంలో కొత్త ప్రవేశ ద్వారం నిర్మాణం జరిగినా లోపల మాత్రం గత నిర్మాణాలు యధావిధిగా కన్పిస్తాయి. నాటి నుంచి నేటి వరకు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థతో పాటు పరిశుభ్రత, ఖైదీల్లో పరివర్తనకు మారుపేరుగా నిలిచిందీ కారాగారం. జైళ్లను దయనీయ పరిస్థితుల నుంచి దేశంలోనే అత్యంత ఉత్తమ ప్రమాణాలు కలిగిన పరివర్తనాలయాలుగా మార్చినందుకు హన్కిన్స్​కు నిజామ్ ప్రభుత్వం 1913 లో ప్రత్యేక పురస్కారం అందజేసింది.

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి..

వరంగల్‌ కేంద్ర కారాగార ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 21వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌ నగర పర్యటనలో భాగంగా ఎంజీఎం ఆసుపత్రిని, జైలును సందర్శించారు. అ సమయంలోనే వరంగల్‌ కారాగారాన్ని వైద్యశాఖకు అప్పగించాలని అదేశాలు జారీ చేశారు. ఈ నెల 21న వరంగల్‌ కేంద్ర కారాగారం(Warangal Central Jail) స్థలంలో ఏర్పాటు చేయనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చేయనున్నారు.

Last Updated : Jun 14, 2021, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.