ETV Bharat / state

Virataparvam team in warangal: 'మా అమ్మాయే ఇంటికొచ్చినంత ఆనందంగా ఉంది' - వరంగల్​లో పర్యటించిన విరాటపర్వం

Virataparvam team Meet Sarala: విరాటపర్వం కథకు స్ఫూర్తిగా నిలిచిన సరళ కుటుంబసభ్యులను చిత్రబృందం కలిసింది. వరంగల్​లో ఇవాళ పర్యటించిన చిత్రబృందం వారితో ముచ్చటించింది. ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Virataparvam team Meet Sarala
వరంగల్​లో విరాటపర్వం చిత్రబృందం
author img

By

Published : Jun 13, 2022, 8:02 PM IST

Virataparvam team Meet Sarala: తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన విరాటపర్వం. నటీనటులు రానా, సాయిపల్లవి చిత్రబృందం ఇవాళ వరంగల్​లో పర్యటించింది. ఈ కథకు స్ఫూర్తిగా నిలిచిన సరళ కుటుంబసభ్యులను పలకరించింది. రాష్ట్రంలో 1990 కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా దర్శకుడు వేణు ఉడుగుల విరాటపర్వం చిత్రాన్ని రూపొందించారు. రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Virataparvam team Meet Sarala
సరళ కుటుంబసభ్యులతో సాయిపల్లవి

ఈ సందర్భంగా వరంగల్​లో పర్యటించిన చిత్ర బృందం సరళ కుటుంబసభ్యులను కలిశారు. ఆ కుటుంబంతో చాలాసేపు అప్యాయంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో సరళ జీవితానికి సంబంధించిన విశేషాలను నటీనటులు గుర్తుచేసుకున్నారు. కథానాయిక సాయిపల్లవిని చూసిన కుటుంబ సభ్యులంతా తమ అమ్మాయే ఇంటికొచ్చిందన్న అనందంతో భావోద్వేగానికి గురయ్యారు. సరళ పాత్రలో వెన్నెలగా నటించిన సాయిపల్లవిని చూసి వారంతా మురిసిపోయారు. విరాటపర్వం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.