భూ నిర్వాసితుల ఆందోళన.... వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో నూతనంగా నిర్మిస్తున్న హెచ్‌పీ గ్యాస్ బాట్లింగ్ ప్లాంటు ఎదుట గ్రామస్థులు బైఠాయించారు. భూ నిర్వాసితులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. స్థానికులకు కాకుండా గుత్తేదారుకు సంబంధించిన వ్యక్తులను నియమించుకుంటున్నట్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్, జిల్లా కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. తమకు నష్ట పరిహారం ఇప్పించాలంటూ వేడుకున్నారు.
.