ETV Bharat / state

ఆ రోడ్డు మాకొద్దు బాబోయ్‌..! విస్త‌ర‌ణ ప‌నులు ఆపాల‌ని గ్రామ‌స్థుల ఆందోళ‌న‌ - పరకాల నియోజకవర్గం

Road Widening issue in Parakala: అద‌స‌లే చిన్న గ్రామం. ఎలాంటి ర‌ద్దీ ఉండ‌దు. దాని మీదుగా బ‌స్సు వెళ్ల‌దు. భారీ వాహనాలు అంతకన్నా వెళ్ల‌వు. అలాంటి ఊరికి 50 ఫీట్ల రోడ్డు వేస్తామ‌ని అధికారులు సిద్ధ‌మ‌య్యారు. దాని వ‌ల్ల ఇళ్ల‌తో పాటు జీవ‌నోపాధి కోల్పోతామంటూ ప‌లువురు గ్రామ‌స్థులు ఆందోళన‌లు చేస్తున్నారు.

Parkal constituency, MLA Challa Dharma Reddy, Hanumakonda district
MLA challa Dharma Reddy
author img

By

Published : Mar 4, 2023, 6:17 AM IST

Road Widening issue in Parakala: గ్రామాల్లో అభివృద్ధి ప‌నులు చేస్తే ఎవ‌రైనా సంతోషిస్తారు. త‌మ గ్రామంలో కావాల్సిన నూతన సౌక‌ర్యాలు, మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తే ఆనందిస్తారు. అందుకు సంబంధిత ప్ర‌జాప్ర‌తినిధుల్ని, అధికారుల్ని మెచ్చుకుంటారు. కానీ.. హ‌నుమ‌కొండ జిల్లాలోని ఓ గ్రామ ప్ర‌జ‌లు మాత్రం రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల్ని వ్య‌తిరేకిస్తున్నారు. ఆ రోడ్డు మాకొద్దు బాబోయ్ అంటూ అక్క‌డే బైఠాయించి ఆందోళ‌న‌లు చేస్తున్నారు.

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కామారం గ్రామ‌స్థులు త‌మ ఊరిలో చేప‌డుతున్న రోడ్డు విస్త‌ర‌ణ ప‌నులు ఆపాలంటూ ఆందోళ‌న‌లు చేస్తున్నారు. బ‌స్సు, భారీ వాహ‌నాలు రాని ఆ గ్రామంలోకి 50 ఫీట్ల రోడ్డు ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అసలు ఎలాంటి రద్దీ లేని గ్రామంలో రోడ్డు విస్త‌ర‌ణ పేరిట త‌మ‌కు అన్యాయం చేస్తున్నారంటూ ఆవేద‌న చెందుతున్నారు. మౌలిక వ‌స‌తుల కోసం గ్రామ అభివృద్ధికి స‌హ‌క‌రిస్తాం కానీ.. దాని పేరుతో త‌మ‌కు అన్యాయం జ‌రిగితే స‌హించేది లేద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

కామారం గ్రామం నుంచి పెంచికలపేటకు వెళ్లే దారి.. గతంలో 18 ఫీట్లు వెడ‌ల్పు ఉండేది. ఈ రోడ్డును విస్త‌రించాల‌ని అధికారులు అనుకున్నారు. ప్ర‌స్తుతం దాన్ని ఇప్పుడు 50 ఫీట్లకు విస్తరిస్తున్నారు. దీని వ‌ల్ల త‌మ ఇళ్ల‌ను కోల్పోతున్నామ‌ని కొంద‌రు అంటే... రోడ్డుకు ఆనుకుని ఉన్న త‌మ జీవ‌నోపాధి దెబ్బ‌తింటుంద‌ని మ‌రి కొంద‌రు ఆందోళ‌న చెందుతున్నారు. క‌నీసం బ‌స్సు సౌక‌ర్యం, ఎలాంటి ర‌ద్దీ లేని ఈ గ్రామంలో ఆ మేర‌కు రోడ్డు విస్త‌రించ‌డం అన‌వ‌స‌రం అంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ నిర‌స‌న‌లు చేస్తున్నారు.

మొద‌ట్లో 40 ఫీట్ల రోడ్డు విస్తరిస్తామని చెప్పి.. దాన్ని ప్ర‌స్తుతం 50 ఫీట్లకు పెంచారని చెబుతున్నారు. దీనికి వ్య‌తిరేకంగా చేసిన గ్రామ స‌భ తీర్మాణాల‌ను సైతం లెక్క‌చేయ‌డం లేద‌ని అంటున్నారు. నిబంధ‌న‌లకు విరుద్ధంగా నిర్మాణ ప‌నులు చేప‌డుతున్నార‌ని, ఇప్ప‌టికే కొన్ని ఇళ్ల‌ను కూల్చివేశార‌ని వాపోతున్నారు. మ‌రోవైపు ఇల్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తుంద‌ని అధికారులు హామీ ఇస్తున్నారు.

ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించారని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 40 ఫీట్లకు కుదించి రోడ్డు పనులు కొనసాగించాలని అధికారుల‌కు ఆదేశించిన‌ట్లు బాధితులు తెలిపారు. అయినప్పటికీ ఎమ్మెల్యే మాటలు వినకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ 50 ఫీట్ల రోడ్డును కొనసాగిస్తున్నారని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని, తమ గోడు వినాలని.. రోడ్డు విస్తరణ పనులను ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు జ‌రిపించాల‌ని వారు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.