ETV Bharat / state

పింఛన్లు రాలేదు.. డబుల్​ బెడ్​రూమ్ ఇవ్వలేదు.. ఏం చేశావని ఇక్కడకు వచ్చావ్..

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్ మండలంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని భీంపల్లి గ్రామస్థులు ప్రశ్నించారు. పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాలేదన్నారు. రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు.

mla, challa darmareddy
చల్లా ధర్మారెడ్డి, పరకాల
author img

By

Published : Jun 18, 2021, 7:39 PM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ రాజీనామాతో హుజూరాబాద్​లో ఉప ఎన్నిక రాబోతోంది. ఈ ఉప ఎన్నికకు అధికార తెరాస ముందు నుంచి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పర్యటించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్ మండలంలో పర్యటించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని గ్రామస్థులు ప్రశ్నించారు.

భీంపల్లిలో తెరాస కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తుండగా, గ్రామస్థులు ప్రశ్నించారు. పింఛన్లకు ధరఖాస్తు చేసుకున్నప్పటికీ రాలేదన్నారు. రెండు పడకల గదులను నిర్మించి ఇస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎంతో మంది పింఛన్లు, రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ నేటికి మంజూరు కాలేదన్నారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. అక్కడే ఉన్న తెరాస నాయకులు, కార్యకర్తలు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు ఎమ్మెల్యే వీటిపై ఎమ్మెల్యే సమాధానం చెబుతానని చెప్పినప్పటికీ వారు నిరసనగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ప్రశ్నించిన గ్రామస్థులు

ఇదీ చదవండి: Women Missing: స్కానింగ్​కి వెళ్తున్నానని చెప్పింది... అదృశ్యమైంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.