వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. వేద పండితుల సమక్షంలో స్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
వీరభద్ర స్వామి దయతో.. కరోనా మహమ్మారి నామరూపాలు లేకుండా పోవాలని ఎమ్మెల్యే సతీశ్ ఆకాంక్షించారు. దేవుని ఆశీస్సులతో పాడిపంటలు చల్లగా ఉండాలని కోరారు. ఈ ఉత్సవాలకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు ఆలయానికి భక్తులు వందలాదీగా తరలివచ్చారు. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ ఛైర్మన్ సుధీర్, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జాతర్ల సంరంభం: 25 రోజుల వ్యవధిలోనే మూడు పెద్ద ఉత్సవాలు