వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వివిధ పార్టీల అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. హాసన్పర్తిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, తెరాస అభ్యర్థి కలిసి ప్రచారం నిర్వహించారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా నగర అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేసిందని ఎమ్మెల్యే రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఓటర్లు తెరాస కార్పొరేటర్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి