వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో సూపర్ స్పైడర్ల వ్యాక్సినేషన్ (Vaccination) ప్రశాంతంగా కొనసాగుతుంది. నగరంలో 5 సెంటర్లలను ఏర్పాటు చేయగా.. టోకెన్లు ముందుగా తీసుకున్నవారికి వైద్యులు టీకాలు వేస్తున్నారు.
అయితే ఏ ఒక్కరు వాక్సిన్ సెంటర్ల వద్ద కొవిడ్ నిబంధనలను పాటించడం లేదు. గుంపులు గుంపులుగా చేరి టీకా తీసుకుంటున్నారు. ముందుగా టోకెన్లు జారీ చేసిన వారికి మాత్రమే వైద్యులు టీకాలు వేస్తున్నారు.