వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు బోరు బావిని ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. బొల్లం తిరుపతికి సంబంధించిన భూమిని గుగులోత్ పాపనాయక్ కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. అర్ధరాత్రి పంటపొలంలో గుర్తుతెలియని వ్యక్తులు బోర్ బావిని పూడ్చి, మోటర్లు, పైపులు ధ్వంసం చేశారని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భూ వివాదం నేపథ్యంలో ప్రత్యర్ధులే ధ్వంసం చేశారని బాధిత రైతు ఆరోపిస్తున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ముల్కనూర్ ఎస్సై రాజ్ కుమార్ బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని... త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తామని అన్నారు.
ఇదీ చదవండి: రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర: వీహెచ్