వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని పబ్లిక్ గార్డెన్ వద్ద తెల్లవారు జామున 2.30 ప్రాంతంలో బర్త్ డే పార్టీ చేసుకొని ఇద్దరు విద్యార్థులు బైక్ పై వస్తూ డివైడర్ను బలంగా ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు కాగా ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు విద్యాసాగర్, శ్రీనివాస్ మృతి చెందడం వల్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మద్యసేవించి వాహనం నడిపినట్లు పోలీసులు చెబుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి - Warangal Crime News today news
హన్మకొండలో జరిగిన రోడ్డుప్రమాదంలో.. ఇద్దరు యువకులు మృతి చెందారు. చేతికి అందివచ్చిన కొడుకుల అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.