ETV Bharat / state

'కార్మికుల ప్రాణాలు పోతున్నా సీఎం పట్టించుకోరా?' - ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొని సంఘీభావం

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో వరంగల్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నాకి దిగారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొని సంఘీభావం తెలిపారు.

'కార్మికుల ప్రాణాలు పోతున్నా సీఎం పట్టించుకోరా?'
author img

By

Published : Oct 14, 2019, 3:08 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వరంగల్ డిపో-2 ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. నిరవధిక సమ్మెలో భాగంగా డిపో ఎదుట ఈ రోజు ధర్నా చేశారు. కాంగ్రెస్, భాజపా, ప్రజా సంఘాల నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క వీరితో పాటు ధర్నాలో కూర్చున్నారు. బస్సులను బయటకు పోనీయకుండా డిపో ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల ప్రాణాలు పోతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

'కార్మికుల ప్రాణాలు పోతున్నా సీఎం పట్టించుకోరా?'

ఇవీ చూడండి: సమ్మె విరమించి చర్చలకు రండి: తెరాస పార్లమెంటరీ నేత కేకే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.