వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది. విధులు బహిష్కరించి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో అధికారులు తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతో బస్సులను నడిపిస్తున్నారు. దసరా పండుగను ముగించుకోని వివిధ ప్రాంతాలకు వెళుతున్న ప్రయాణికులకు ఇబ్బందులు పడకుండా అధికారులు అధిక సంఖ్యలో బస్సులు నడిపిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్కు ఎక్కువ సంఖ్యలో బస్సులను తిప్పుతున్నారు. అధిక బస్సులు తిప్పిన ఆదాయం మాత్రం రావడం లేదు. కోట్లలో నష్టం వస్తుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేయటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్టాండ్లో పోలీస్ బలగాలు అధిక సంఖ్యలో మోహరించారు.
ఇవీ చూడండి: తెరాస నాయకుడి ఇంట్లో రూ.11 లక్షల మద్యం పట్టివేత