తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరుకుంది. వరంగల్లో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వామపక్ష పార్టీల నేతలు సామూహిక దీక్షలు చేపట్టారు. 12 రోజులుగా ఆర్టీసీ కార్మికులు విధుల బహిష్కరించి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
ఇదీ చదవండిః 'నష్టాల నుంచి గట్టెక్కాలంటే విలీనం ఒక్కటే మార్గం'