వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు సమావేశమయ్యారు. తాము విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. 48 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని... సీఎం కేసీఆర్ మొండి వైఖరి వల్ల ఎంతో మంది కార్మికులు చనిపోయారన్నారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తామొక మెట్టు దిగినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు.
ఇదీ చదవండిః మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు