వరంగల్ రీజియన్లో ఆర్టీసీ కార్మికల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది మొత్తం 4100 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా....అధికారులు తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న డ్రైవర్లు, కండక్టర్లతో.... ఆర్టీసీ, అద్దె బస్సులు నడిపిస్తున్నారు. గత రెండు రోజులతో పోలిస్తే....ఇవాళ ఎక్కువ సంఖ్యలో బస్సులు తిరుగుతున్నాయి. బస్టాండ్లలో ప్రయాణీకులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు. మొత్తం 738 బస్సులు తిరగాల్సి ఉండగా...495 బస్సులను వివిధ మార్గాల్లో తిప్పారు. ఇటు బస్టాండ్, డిపోల వద్ద అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులను మొహరించారు.
ఇవీ చూడండి: సడలని సర్కార్... మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె