దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా.. అభివృద్ధిలో తెలంగాణను అగ్రగ్రామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రభుత్వ ఛీప్ విప్ వినయ్‌భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రచారం నిర్వహించారు.
![షటిల్ ఆడుతున్న కడియం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-01-07-trs-mlc-ennikala-pracharam-ab-vis-ts10077_07012021085000_0701f_00156_462.jpg)
ఈ కార్యక్రమంలో వినయ్‌భాస్కర్, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వేర్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం నడకకు వచ్చిన వారిని కలిసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వేర్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.
![షటిల్ ఆడుతున్న పల్లా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-01-07-trs-mlc-ennikala-pracharam-ab-vis-ts10077_07012021085007_0701f_00156_496.jpg)
రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారన్నారు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలు తీరనున్నాయని.. పీఆర్సీ, నోటిఫికేషన్‌ను ప్రకటిస్తారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వేర్ రెడ్డి తెలిపారు. అనంతరం వాకర్స్‌తో కలిసి షటిల్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు.
ఇదీ చూడండి: 'ఆ భూములు మా నాన్న కొన్నవి.. ఇవ్వాల్సిందే'