ETV Bharat / state

సన్నాహక సమావేశాలు.. కార్యకర్తలకు దిశా నిర్దేశాలు! - మంత్రి సత్యవతి రాఠోడ్

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాలు జోరందుకున్నాయ్. వరంగల్​లో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్ విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తూ... తెరాస శ్రేణులను పట్టభద్రుల ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలను యువతకు వివరించి వారి మద్దతు సంపాదించాలని.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

TRS Ministers Meetings With cadre Due To MLC Elections in warangal
సన్నాహక సమావేశాలు.. కార్యకర్తలకు దిశా నిర్దేశాలు!
author img

By

Published : Sep 20, 2020, 4:20 PM IST

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్ధానాలపై గురి పెట్టిన అధికార తెరాస అందుకు అనుగుణంగా.. ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. అధిష్టానం ఆదేశాలతో నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంత్రులు, శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి,మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గ స్ధానాల్లో ఓటర్ల నమోదు షెడ్యూల్​ను త్వరలో ఎన్నికల సంఘం ప్రకటించనుంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. రెండు నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని ఆదేశించారు.

సన్నాహక సమావేశాలు.. కార్యకర్తలకు దిశా నిర్దేశాలు!

కేంద్రంపై ఎర్రబెల్లి ధ్వజం..

ఈ క్రమంలోనే వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా... పార్టీ నేతలు జోరుగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం వర్ధన్నపేట, వరంగల్ అర్బన్ నియోజకవర్గాల్లో జరిగిన సన్నాహక సమావేశాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే దాస్య వినయ్​ భాస్కర్​, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిధుల పరంగా కేంద్రం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని... సంక్షేమ పథకాలకు ఇచ్చేది కొంతైతే.. చెప్పుకునేది ఎక్కువగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

ఓట్లు నమోదు చేయండి!

పట్టభద్రుల ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దని గ్రాడ్యుయేట్లను అందరిని ఓటర్లుగా నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను యువతకు వివరించాలని సూచించారు. పార్టీ నాయకులు వెనక ఉండి.. యువతను ముందుకు నడపించాలన్నారు. భవిష్యత్​ అంతా యువతకే ప్రాధాన్యం అని తెలిపారు. వచ్చే వారం రోజుల్లో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువమంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించి... ఎన్నికల్లో వారి మద్దతు ద్వారా రెండు స్థానాల్లోనూ విజయకేతనం ఎగరవేయాలి.. తెరాస సత్తా విపక్షాలకు మరోసారి రుచి చూపించాలని అధికార పక్ష నేతలు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: ఆన్​లైన్​ పాఠాలకు... స్మార్ట్​సిటీకి విద్యుత్​ కోతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.