ETV Bharat / state

తెరాసలో నిరసన పర్వం.. టవర్​ ఎక్కి ఆందోళన

వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో తెరాసలో టికెట్​ రాని పలువురు ఆశావహులు నిరసన బాట పట్టారు. జాబితాలో పేరులోని కొంతమంది టవర్లు ఎక్కి ఆందోళన చేస్తున్నారు.

trs leaders protest in hanmakonda
trs leaders protest in hanmakonda
author img

By

Published : Apr 22, 2021, 4:05 PM IST

వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో తెరాసలో టికెట్​ రాని పలువురు ఆశావహులు… నిరసనల ద్వారా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఓ వైపు మంత్రులు, ఎమ్మెల్యేలు… బుజ్జగింపు యత్నాలు చేస్తుంటే… జాబితాలో పేరులోని కొంతమంది మాత్రం టవర్లు ఎక్కి ఆందోళన చేస్తున్నారు.

58వ డివిజన్ నుంచి తనకు టికెట్​ ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ… హన్మకొండలోని ఓ సెంటర్ వద్ద నున్న ఓ భవనంపైకి ఎక్కి.. శోభారాణి పెట్రోల్​ సీసా పట్టుకుని హల్​చల్ చేశారు. బుధవారం రాత్రి 6వ డివిజన్​ నుంచి తన సతీమణి ద్వారా నామపత్రం దాఖలు చేయించిన దర్శన్​సింగ్… టికెట్ రాలేదని మనస్తాపానికి గురయ్యారు. నక్కల గుట్ట సమీపంలోని టీవీ టవర్​ ఎక్కి హల్​చల్​ చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నా… టికెట్ రాలేదని వాపోయారు. చివరకు పార్టీ నేతలు, పోలీసులు సర్ది చెప్పడంతో తన నిరసన విరమించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.