విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్(TRS leaders press meet) డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన వర్శిటీలను ఏర్పాటు చేయకుండా ఓరుగల్లు వాసులను, రాష్ట్ర ప్రజలను భాజపా దగా చేసిందని ధ్వజమెత్తారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. లేదంటే వరంగల్ కేంద్రంగా ఉద్యమం తప్పద(TRS leaders press meet)ని హెచ్చరించారు. ఈ మేరకు హన్మకొండలో జరిగిన మీడియా సమావేశంలో తెరాస నేతలు వినయ్ భాస్కర్, పసునూరి దయాకర్, సీతారాం నాయక్.. కేంద్ర వైఖరిపై విమర్శలు గుప్పించారు.
కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీలు మా ప్రధాన డిమాండ్. రాష్ట్ర భాజపా నాయకులకు చిత్తశుద్ధి ఉంటే హామీలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. లేదంటే ఉద్యమ స్ఫూర్తితో పోరుగల్లు లాంటి ఓరుగల్లు నుంచి పార్టీలు, కులమతాలకతీతంగా ఉద్యమం చేపడతాం. తెలంగాణ సాధన కోసం తెరాస ఎన్నో త్యాగాలు చేసింది. 60 లక్షల సభ్యత్వం ఉన్న గులాబీ దండు గట్టిగా దగ్గినా కాంగ్రెస్, భాజపా కొట్టుకుపోతాయి. మా సహనాన్ని పరీక్షించొద్దు. తెలంగాణపై ప్రేమ ఉంటే.. ఈ రాష్ట్ర ప్రజలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులకు కావాల్సిన సదుపాయాలు కల్పించండి. ఐటీఐఆర్‌ను తీసుకురండి. -వినయ్ భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే
రాష్ట్రంలోని భాజపా ఎంపీలు తెలంగాణను ఎప్పుడూ పట్టించుకోలేదు. కాళేశ్వరం లాంటి అతి పెద్ద ప్రాజెక్టు చేపట్టినా.. రాష్ట్రానికి జాతీయ హోదా రాలేదు. కేంద్రం నెరవేర్చాల్సిన హామీలు ఎన్ని ఉన్నా.. ఇప్పటివరకు ఏ ఒక్కటీ జరగలేదు. ఇక్కడి భాజపా నాయకులు తెలంగాణ పౌరులైనప్పుడు.. రాష్ట్రం కోసం పాటుపడాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరిజనులు అధిక శాతం ఉన్నారు. వారి కోసం గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయాలి. -పసునూరి దయాకర్, వరంగల్ ఎంపీ
రాష్ట్ర భాజపా నాయకులకు తెలంగాణ అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని వినయ్ భాస్కర్(TRS leaders press meet) ఆరోపించారు. అదే ఉంటే సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు తెచ్చేవారని అభిప్రాయపడ్డారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి.. వరంగల్‌కు పర్యాటకుడిగా వచ్చి వెళ్లారు తప్ప.. రామప్ప అభివృద్ధికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. పదే పదే అబద్ధాలు చెప్పడం తప్ప భాజపా నేతలు రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని.. పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్(TRS leaders press meet) విమర్శించారు.
ఇవీ చదవండి: Bhatti Vikramarka : హుజూరాబాద్ సమీక్షపై వచ్చిన వార్తలన్నీ అబద్ధం.. అసలేం జరిగిందంటే..: భట్టి
Revanth Reddy on KCR: కేసీఆర్.. రైతులపై నిజంగా ప్రేముంటే దిల్లీలో దీక్ష చేయ్..: రేవంత్‌రెడ్డి