ఈ నెల 12న మంత్రి కేటీఆర్ వరంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన విజయవంతం చేయాలని కోరుతూ.. వరంగల్ పశ్చిమ తెరాస నియోజకవర్గం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. హన్మకొండలోని అంబేడ్కర్ భవన్ నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రారంభించారు. అనంతరం తెరాస శ్రేణులతో బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ నెల 12న నగరంలో వందల కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఉగాది నుంచి రోజువారీగా తాగు నీరు, నగరవాసులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. రానున్న వరంగల్ నగరపాలక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయనున్నామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఫూలే ఆలోచనా విధానాన్నే ప్రభుత్వం అమలుచేస్తోంది: కేసీఆర్