వరంగల్ గ్రామీణ జిల్లాలో కురిసిన వర్షాలకు రహదారుల వెంట ఉన్న మహావృక్షాలు రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల ఖమ్మం- వరంగల్ రహదారిపై వృక్షాలు విరిగిపడ్డాయి. ఈ మేరకు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మూడురోజులుగా కురుస్తున్న ఏకధాటి వర్షాలకు వరంగల్- ఖమ్మం రహదారిపై గుంతలు నోర్లు తెరుచుకున్నాయి. తాజాగా మహావృక్షాలు సైతం గాలి వానకు నేలకూలగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చెట్లు విరిగిపడినా.. వాటిని అధికారులు తొలగించకపోగా.. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదీ చూడండి: హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం... భయాందోళనలో ప్రజలు