వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(నిట్)లో టచ్ లెస్ శానిటైజర్‌ను రూపొందించారు. ఈసీఈ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వి. సుధాకర్ అతి తక్కువ ఖర్చుతో దీనిని తయారుచేశారు. అల్ట్రాసోనిక్ సెన్సార్ మైక్రో కంట్రోలర్, ఎల్ఈడీ సోలినోయిడ్ సిద్ధాంతం ప్రకారం ఈ శానిటైజర్‌ను రూపొందించినట్లు సుధాకర్ తెలిపారు. బయట మార్కెట్లో దీని విలువ రూ.2 వేలు ఉండగా తాను తయారు చేసిన శానిటైజర్‌ను కేవలం రూ.800 అందుబాటులోకి తేవచ్చని తెలిపారు.
కొవిడ్ రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో తక్కువ ఖర్చుతో శానిటైజర్ అందుబాటులోకి తీసుకువచ్చిన సుధాకర్‌ను నిట్ డైరెక్టర్ ఆచార్య ఎన్.వి.రమణారావు, రిజిస్ట్రార్ ఎస్. గోవర్దనరావు అభినందించారు.
ఇదీ చదవండి: కరోనా కట్టడికి పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్