ఆదివాసీ హక్కుల పరిరక్షణకు చేపట్టబోయే కార్యాచరణకు అన్ని విధాలా తమ మద్దతు ఉంటుందని తెజస అధ్యక్షులు కోదండరాం పేర్కొన్నారు. భూమి మీద ఉన్న హక్కు కోసం సమ్మక్క సారలమ్మల నాటి నుంచి పోరాటం జరుగుతోందని తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు.
పోడు భూముల సాగు విషయంలో ఆదివాసీల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం వెంటనే తొలగించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఉద్దేశించిన జీవో నెంబర్ 3ను ఎవరికీ భంగం కలగని రీతిలో పునురుద్ధరింపజేయాలని సూచించారు.
హామీ.. హామీగానే మిగిలిపోయింది..
పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ.. హామీగానే మిగిలిపోయిందని ములుగు శాసనసభ్యురాలు సీతక్క పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులు ఆదివాసీలపై అకారణంగా కేసులు పెడుతూ భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.