ETV Bharat / state

భూపాలపల్లిలో గండ్ర వర్సెస్ గండ్ర.. 144 సెక్షన్ విధించిన పోలీసులు - భూపాలపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్తత

Gandra Vs Gandra House Arrest: ఇటీవల రేవంత్‌రెడ్డి పర్యటనతో భూపాలపల్లిలో నెలకొన్న రాజకీయ వేడి కొనసాగుతోంది. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నేతల పరస్పర సవాళ్లు-ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత నెలకొంది. రేవంత్‌రెడ్డి యాత్రలో చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ.. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి సవాల్‌ విసిరారు. అంబేడ్కర్‌ కూడలి వద్దకు కాంగ్రెస్‌ నేతలు చర్చకు రావాలని సవాల్ చేశారు. గండ్ర చేసిన భూకబ్జాలు, అవినీతి, అక్రమాలు నిరూపించేందుకు తాము సిద్ధమంటూ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణరావు ప్రతిసవాల్‌ విసిరారు. ఈ ఉదయం 11 గంటలకు తాను చర్చకు వస్తున్నట్లు ప్రకటించారు.

Gandra Vs Gandra House Arrest
Gandra Vs Gandra House Arrest
author img

By

Published : Mar 2, 2023, 3:06 PM IST

భూపాలపల్లిలో కొనసాగుతున్న రాజకీయ వేడి.. గండ్ర వర్సెస్ గండ్ర హౌస్ అరెస్ట్

Gandra Vs Gandra House Arrest: హనుమకొండలో కాంగ్రెస్ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు చేరుకున్నారు. అలాగే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి భూకబ్జాలు అవినీతి, అక్రమాలను నిరూపించడానికి ఆధారాలతో సహా రెడీ అయ్యారు. హనుమకొండలోని నక్కలగుట్టలో తన నివాసం నుంచి భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్​కు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అయితే శాంతి భద్రతల పేరుతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.

సవాళ్లు.. ప్రతిసవాళ్లు: భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణరావుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇరువురి పరస్పర ఆరోపణలతో రాజకీయం రసవత్తరంగా మారింది. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం జరిగిన రేవంత్​రెడ్డి సభలో గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై తీవ్రమైన అవినీతి అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు చేయడమే కాకుండా బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.

గండ్ర వర్సెస్ గండ్ర: ఎమ్మెల్యే గండ్ర సైతం సత్యనారాయణ రావుతో సవాల్​కు సిద్ధమని ప్రకటించారు. బుధవారం ఇరువురు నేతలు వేరువేరుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ భవన్​లో, జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలిసి ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు. భూకబ్జాల ఆరోపణలపై ఆధారాలు ఉంటే నేడు అంబేద్కర్ చౌరస్తా సెంటర్ వద్ద ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సత్యనారాయణరావుకు సవాలు విసిరారు.

ఆయిల్ ఫామ్ కోసం ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో తన కొడుకు గౌతమ్​రెడ్డి కంపెనీ పెడుతుంటే అక్రమ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కాగా అన్ని రకాల ఆరోపణలకు ఆధారాలున్నాయంటూ గండ్ర సత్యనారాయణరావు వివరించారు. మీడియా మధ్యవర్తులుగా ఆక్రమాలు నిరూపించేందుకు సిద్ధమని నేడు అంబేద్కర్ చౌరస్తా వద్ద 11 గంటలకు సిద్ధంగా ఉంటానని విలేకరుల సమావేశం పెట్టి మరీ వెల్లడించారు.

చర్చలో మీడియా ప్రతినిధులు జడ్జీలుగా వ్యవహరించాలని, ఇరు పార్టీల కార్యకర్తలు ఎవరికి ప్రాతినిధ్యం ఉండవద్దని తెలిపారు. పోలీసులు ఎలాంటి అడ్డంకులు సష్టించరాదని షరతు విధించారు. ఆధారాలు చూపించకుంటే రాజకీయ సన్యాసం తీసుకోవడమే కాకుండా ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇరువురి ఆరోపణలు నిరూపించుకునేందుకు అంబేద్కర్ చౌరస్తా వేదికగా మారనుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

జిల్లాలో నేటి నుంచి 144 సెక్షన్ అమలు: ఇద్దరు నేతలు ఒకే చేయడంతో జిల్లా కేంద్రం రాజకీయంగా వేడెక్కింది. రేవంత్​రెడ్డి సభపై బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు రాళ్లు, బీరు బాటిల్స్, గుడ్లు, టమాటాలు విసురుకోవడం పలువురికి గాయాలు అవడంతో రెండు పార్టీల మధ్యన వివాదం నివురుగప్పిన నిప్పులా మారింది. రాజకీయ ప్రత్యారోపణలతో నేడు ఏమి జరుగుతుందోనని జిల్లా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా బల ప్రదర్శనకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె.సురేందర్​రెడ్డి హెచ్చరించారు. వారం వరకు జిల్లా కేంద్రంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులు గుంపులుగా ఎవరూ గుమిగుడవద్దని, జన జీవనానికి ఇబ్బంది కలిగించ వద్దని ఎస్పీ అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.