SSC paper leak case update: రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ అయి వాట్సాప్‌లో చక్కర్లు కొట్టిన ఘటనలో.. తాను ఏ తప్పూ చేయలేదని, అయిదేళ్ల పాటు డీబార్ చేయడం అన్యాయమని బాధిత విద్యార్థి బోరున విలపించాడు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రాన్ని నిందితుడికి అందజేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హనుమకొండ కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి.. కమలాపూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం ఆంగ్ల పరీక్ష రాయడానికి వచ్చాడు. అతణ్ని హనుమకొండ జిల్లా విద్యాధికారి పిలిచి ‘నీ క్వశ్చన్ పేపర్ వల్ల ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు’ అంటూ మందలించారు. పరీక్ష రాయవద్దంటూ బయటకు పంపించారు.
బాధిత విద్యార్థి పరీక్ష కేంద్రం బయటకు వచ్చి తల్లితో కలిసి మీడియాతో మాట్లాడాడు. హాల్‌టికెట్ తీసుకొని ఓ పత్రంపై తన సంతకం తీసుకున్నారని విద్యార్థి కన్నీటి పర్యాంతమయ్యాడు. కమలాపూర్ ‘‘పరీక్ష కేంద్రంలో మొదటి అంతస్తులోని మూడో నంబర్ గదిలో కిటికీ దగ్గర కూర్చుని పదో తరగతి హిందీ పరీక్ష రాస్తుండగా.. అనుకోకుండా గోడ మీది నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని బాలుడు.. తన హిందీ ప్రశ్నపత్రం ఇవ్వాలని, లేకుంటే చంపుతానని బెదిరించాడు. అయినప్పటికీ క్వశ్చన్ పేపర్ ఇవ్వకపోయే సరికి లాక్కొని సెల్ ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నాడు’’ అని తెలిపాడు.
SSC Telugu paper leak in telangana: వికారాబాద్ జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైన ఘటనలో నలుగురు ఉద్యోగులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇన్విజిలేటర్లు బందెప్ప సమ్మప్ప, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ గోపాల్, సస్పెన్షన్ చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్ సస్పెన్షన్ అయ్యారు. పరీక్ష ప్రారంభమయ్యాక బందెప్ప ప్రశ్నపత్రం ఫొటో తీసి ఉ.9.37కు సమ్మప్పకు ప్రశ్నపత్రం వాట్సాప్‌లో పంపినట్లు గుర్తించారు. వీరి సెల్‌ఫోన్లను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని వివరాలపై విచారణ చేపట్టినట్లు తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు.
బందెప్ప జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడన్నారు. తెలుగు ప్రశ్నపత్రాన్ని లీక్ చేశాక వారి సెల్‌ఫోన్ నుంచి ఎవరికి పంపారు? వాళ్లతో ఎవరెవరు మాట్లాడారు? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. పరారీలో ఉన్న శివకుమార్ జిరాక్స్ కేంద్రం నిర్వాహకుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.
ఇవీ చదవండి: