ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సహస్ర కలశాభిషేకంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు పదిహేను రోజులపాటు కన్నుల పండువగా జరుగనున్నాయి.
చివరిరోజు అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే శాకాంబరి ఉత్సవాలు కరోనా వైరస్ కారణంగా సాదా సీదాగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.