ETV Bharat / state

నేటితో ముగియనున్న మినీపోరు ప్రచార గడువు - రేపు సాయంత్రం ప్రచారం ముగింపు

రాష్ట్రంలో జరగనున్న మినీపోరు ప్రచార గడువు నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచారాలు నిర్వహించరాదని ఎస్​ఈసీ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచార గడువును కుదించింది. ఫలితంగా పోలింగ్​ సమయానికి 72 గంటల ముందే పార్టీలు ప్రచారాలను నిలిపివేయాల్సి వస్తోంది.

ముగియనున్న మినీపోరు ప్రచార గడువు
ముగియనున్న మినీపోరు ప్రచార గడువు
author img

By

Published : Apr 26, 2021, 10:41 PM IST

Updated : Apr 27, 2021, 2:51 AM IST

ముగియనున్న మినీపోరు ప్రచార గడువు

వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థలు సహా.. ఇతర మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం.. నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచారాలు నిర్వహించరాదని ఎస్​ఈసీ పార్టీలకు సూచించింది. ఈ నేపథ్యంలో పోలింగ్​కు 72 గంటల ముందే మైకులు చిన్నబోనున్నాయి. మరోవైపు ప్రచారానికి కొన్ని గంటలే ఉండటంతో ప్రతి ఓటును అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కీలక నేతలు రంగంలోకి దిగి.. ఓటర్ల ప్రసన్నం కోసం రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. గులాబీ జెండా ఎగుర వేయటమే లక్ష్యంగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు.

వరంగల్‌ పరిధిలోని గుండ్ల సింగారం, పెగడపల్లి, వంగపహాడ్‌లో.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌తో కలిసి.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ప్రచారం చేశారు. కరీమాబాద్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రోడ్‌షోలో పాల్గొన్నారు. రెడ్డిపాలెంలో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రచారం చేశారు. హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరికొన్ని నెలల్లో వరంగల్‌లో అధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తామని... పేదలకు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈటల తెలిపారు.

50 ఏళ్ల బృహత్ ప్రణాళిక

పాలకుల నిర్లక్ష్యంతో వరంగల్‌ అభివృద్ధి కుంటు పడిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. భాజపా అభ్యర్థులను గెలిపించాలని 43, 44 డివిజన్లలో రోడ్‌షో నిర్వహించిన ఆయన..గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌ను తలపించే.. 50 ఏళ్ల బృహత్ ప్రణాళిక రూపొందించామన్న కిషన్‌రెడ్డి.. వరంగల్‌ను ఫ్లడ్‌ ఫ్రీ సిటీగా మారుస్తామని తెలిపారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్న ఆయన.. కేసీఆర్‌, కేటీఆర్‌ నిర్లక్ష్యం వల్లే మామునూరు విమానాశ్రయం ఏర్పాటు నిలిచిపోయిందని ఆరోపించారు. తెరాస హయాంలో వరంగల్‌లో అవినీతి రాజ్యమేలుతోందని.. వారందరికీ ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పాలని కోరారు.

వైఫల్యాలు ఎండగడుతూ

వరంగల్‌లో పూర్వ వైభవం సాధించాలనే పట్టుతో ఉన్న కాంగ్రెస్‌... ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ... ప్రచారం సాగిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర నేతలు, అభ్యర్థులు డివిజన్లు చుట్టేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ... పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తెరాస హయాంలో నగరంలో భూ కబ్జాలు, అవినీతి పెద్ద ఎత్తున పెరిగిపోయిందని ఆరోపించారు. నగరంలో మడికొండ నుంచి హరిత హోటల్‌ వరకు కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. కాజీపేట్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ రాకపోవటానికి తెరాస, భాజపాలే కారణమని ఆరోపించారు. తెరాస ప్రభుత్వ తీరుతో సౌకర్యాలు లేక వరంగల్‌ ఎంజీఎం డంపింగ్‌ యార్డును తలపిస్తోందని రేవంత్‌ విమర్శించారు.

ఇదీ చూడండి : కాంగ్రెస్​ను అణగదొక్కడానికే.. నాటకాలు ఆడుతున్నారు: రేవంత్​రెడ్డి

Last Updated : Apr 27, 2021, 2:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.