వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు సహకార పరపతి సంఘం ఎన్నికలు ముగిసాయి. పాలకవర్గంలోని 1, 2, 5, 7, 10 స్థానాల సభ్యుల కోసం జరిగిన ఎన్నికల్లో 14 గ్రామాలకు చెందిన 2,333 మంది రైతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1గంటకు ముగిసింది. అనంతరం ఓట్లు లెక్కిస్తున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం పట్ల ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:వారికి స్మార్ట్ఫోన్లే లేవ్- మరి ఆన్లైన్లో చదువెలా?