ETV Bharat / state

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకోం: ఎర్రబెల్లి

గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా పేర్లు ప్రకటించి, బీఫారాలు అందజేశారు. తెరాస అభివృద్ధే తమని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

gwmc trs candidates, errabelli dayakar rao about warangal elections
వరంగల్ ఎన్నికల తెరాస అభ్యర్థులు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
author img

By

Published : Apr 21, 2021, 1:21 PM IST

గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడిన వారు... పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే 18 మంది అభ్యర్థుల జాబితాను మంత్రి సత్యవతి రాఠోడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో కలిసి ప్రకటించారు. నియోజక వర్గాల వారీగా అభ్యర్థుల పేర్లు ప్రకటించి... బీఫారాలు అందించారు.

గెలుపు మాదే..

వివిధ సమీకరణాల వల్ల అందరికీ అవకాశం కల్పించలేకపోయామని మంత్రి తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎవరూ తమకు పోటీ కాదని.. ప్రభుత్వం చేసిన అభివృద్ధే తెరాస అభ్యర్థులను గెలిపిస్తుందని మంత్రి సత్యవతి, ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

నియోజకవర్గాల వారీగా..

మొత్తం 66 డివిజన్లలో 18 మంది అభ్యర్థుల జాబితా...

  • వరంగల్ తూర్పు నియోజకవర్గం- 4
  • పశ్చిమ నియోజకవర్గం- 5
  • పరకాల నియోజకవర్గం- 3
  • వర్ధన్నపేట నియోజకవర్గం- 6
    వరంగల్ ఎన్నికల తెరాస అభ్యర్థులు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఇదీ చదవండి: పిల్లల్లో కరోనా ముప్పు.. అశ్రద్ద వద్దంటున్న నిపుణులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.