ETV Bharat / state

ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికొదిలేసింది: కోదండరాం - కోదండరాం తాజా వార్తలు

కరోనా వేళ ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికొదిలేసిందని తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం ఆరోపించారు. ప్రజల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టడం లేదంటూ మండిపడ్డారు. తక్షణమే రాష్ట్రంలో కొవిడ్ పరీక్షలను పెంచాలని డిమాండ్​ చేశారు.

The government has blown up public safety: Kodandaram
ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికొదిలేసింది: కోదండరాం
author img

By

Published : Jul 24, 2020, 12:50 PM IST

Updated : Jul 24, 2020, 2:31 PM IST

కరోనా కట్టడిలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని తెజస అధ్యక్షులు కోదండరాం మరోసారి ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి జరిగిందని ఆరోపించారు. ప్రజల ఇబ్బందులు ముఖ్యమంత్రికి పట్టణం లేదంటూ మండిపడ్డారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని ప్రెస్​క్లబ్​లో ఆయన మాట్లాడారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. మన రాష్ట్రంలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని కోదండరాం ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా భద్రతను గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా పరీక్షలు పెంచి.. ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్​ చేశారు.

కరోనా కారణంగా ఎంతో మంది తమ ఉపాధి కోల్పోయి సంక్షోభంలో పడ్డారని కోదండరాం పేర్కొన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలవాలని సూచించారు. ప్రతి పేద కుంటుబానికి ఉచిత రేషన్​, రూ.7500 ఇవ్వాలని కోరారు. యువతకు నిరుద్యోగ భృతి అందించాలని అన్నారు. లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులకు ఆదాయ భద్రత కల్పించాలన్నారు. దాంతోపాటు సీఎం సహాయనిధికి వచ్చిన నిధుల వివరాలు వెల్లడించాలని డిమాండ్​ చేశారు.

ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికొదిలేసింది: కోదండరాం

ఇదీచూడండి: కరోనా భయం.. అంత్యక్రియల అడ్డగింత.. కోర్టుకు పంచాయితీ.. ఆపై..?

Last Updated : Jul 24, 2020, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.