నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు.
కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మహిళ నేత రవళి సొమ్మసిల్లి పడిపోయింది. ఆందోళనలను చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి: 'సాగు చట్టాలను నిలిపివేస్తారా? లేక మేమే చేయాలా?'