ETV Bharat / state

Tension at MLA Vinay Bhaskar Office : ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ ఆఫీస్‌ ముట్టడికి బీజేపీ నేతల యత్నం.. హనుమకొండలో ఉద్రిక్తత - ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ ఆఫీస్‌ ముట్టడికి యత్నం

Tension at MLA Vinay Bhaskar Camp Office : హనుమకొండలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ, బీఆర్‌ఎస్ పోటాపోటీ ఆందోళనలతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేపీ శ్రేణులు యత్నించగా.. పోలీసులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ జరగగా.. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

bjp protests in telangana
bjp protests at mla camp offices in telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2023, 2:16 PM IST

Updated : Aug 24, 2023, 2:27 PM IST

Tension at MLA Vinay Bhaskar Office ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ ఆఫీస్‌ ముట్టడికి బీజేపీ నేతల యత్నం హనుమకొండలో ఉద్రిక్తత

Tension at MLA Vinay Bhaskar Camp Office : వరంగల్‌ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్‌భాస్కర్ క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలను ముట్టడించాలన్న బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి యత్నించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, రెండు పడక గదులు ఇవ్వలేదంటూ.. బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు.

BJP Protest in Hanamkonda Today : ఇది తెలిసి ముందస్తుగానే.. కార్యాలయం వద్ద పోలీసులు.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీగా మోహరించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పరస్పరం తోపులాటలు జరిగాయి. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌, బీజేపీ వర్గాలు.. కర్రలతో, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అరెస్ట్‌ చేసిన వారిని కాజీపేటలోని పోలీస్ శిక్షణా కేంద్రానికి తరలించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రావు పద్మ.. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని మండిపడ్డారు.

BJP Protest MLA Camp Offices in Telangana : ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదంటూ.. రాష్ట్రవ్యాప్తంగా బీజేేపీ ఆందోళనలు

Tension in Hanamkonda : మరోవైపు.. బీజేపీ కార్యకర్తలు విడతల వారీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి వస్తుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ముళ్ల కంచెలతో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి.. బందోబస్తు నిర్వహిస్తున్నారు. వరంగల్ తూర్పుతో పాటు పశ్చిమ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ శ్రేణులను అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థి నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు.

అంతకుముందు ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ ఇంటి ముట్టడికి పిలుపునివ్వగా.. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను గృహ నిర్బంధం చేశారు. దీంతో కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. చివరకు పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసుల కళ్లుగప్పి.. కార్యకర్తలతో కలిసి రావు పద్మ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు ర్యాలీగా వస్తుండగా.. పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

మంత్రి గంగుల ఇంటి ముట్టడికి యత్నం..: ఇదిలా ఉండగా.. కరీంనగర్‌లోనూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న డిమాండ్‌తో బీజేపీ నాయకులు మంత్రి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. కాషాయ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. వారు ప్రతిఘటించారు. రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. కొందరు కార్యకర్తలు గేటు దూకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు.

BJP Bus Yatra Plan in Telangana : ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో.. బీజేపీ బస్సు యాత్ర

Kavitha Vs Kishan Reddy : మహిళా రిజర్వేషన్లపై.. కవిత, కిషన్‌ రెడ్డి వర్డ్​ వార్‌

Last Updated : Aug 24, 2023, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.