Harish Rao Comments on NDA Govt : కేంద్ర ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్ కార్మికులను పట్టించుకోవట్లేదన్న ఆయన.. భాజపా పాలనలో నిత్యావసరాలతోపాటు, ఇంధనం, గ్యాస్ ధరలు ఆకాశన్నంటుతున్నాయని అన్నారు. గ్యాస్ ధరలు పెంచిన కారణంగా.. పేదలు తిరిగి కట్టెల పొయ్యిలు కొంటున్నారని ఎద్దేవా చేశారు.
Harish Rao Comments on Central Govt : గత ప్రభుత్వాలు ఏనాడూ కార్మికులను పట్టించుకోలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెరాస సర్కార్ అన్నివర్గాల వారి అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. ఆటోలకు లైఫ్ టాక్స్ మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు లక్ష ద్విచక్రవాహనాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
Harish Rao hanamkonda Tour News : హనుమకొండలో పర్యటించిన మంత్రి హరీశ్... కార్మిక చైతన్య మాసోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్మికులతో మాట్లాడిన మంత్రి... వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌తో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి తెలిపారు.
Harish Rao Visits hanamkonda : "ఏడాదిన్నరలోగా వరంగల్ హెల్త్ సిటీని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. 2వేల పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తాం. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడమే మా లక్ష్యం. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పాటుపడుతోంది."
- హరీశ్ రావు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి