రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీకి వరంగల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు 100 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 66వేల379 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు 521 మంది సిబ్బందిని అధికారులు నియమించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కోసం 120 మంది సిబ్బందిని నియమించారు. నల్గొండకు బ్యాలెటు బాక్సులను తరలించేందుకు 14 రూట్లను ఎంపిక చేశారు.
- ఇదీ చూడండి : రేపే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు