ETV Bharat / state

'పుర'అధికారులపై చీఫ్​విప్ ఆగ్రహం

author img

By

Published : Jun 6, 2020, 3:46 PM IST

వరంగల్​ మున్సిపల్ అధికారులపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మురికి కాలువలు శుభ్రంగా లేకపోవడం చూసి అధికారులపై మండిపడ్డారు.

telangana-chief-whip-vinay-bhaskar-fires-on-warangal-municipal-officers
వరంగల్​ 'పుర'అధికారులపై ప్రభుత్వ చీఫ్​విప్ ఆగ్రహం

వరంగల్​ పురపాలక అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా హన్మకొండలోని స్నేహనగర్​ కాలనీలోని మురికి కాలువలను స్థానిక కార్పొరేటర్​తో కలిసి పరిశీలించారు. మురికి కాలువలు శుభ్రంగా లేకపోవడం గమనించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పురపాలక అధికారులపై మండిపడ్డారు.

ఓ వైపు కరోనా, మరోవైపు వానాకాలంలో సీజనల్​ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూనే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రెండు మూడు వారాల్లో మంత్రి కేటీఆర్ వరంగల్​ పర్యటన ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చెప్పారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.