దాస్యం కుటుంబ సభ్యులెవరూ అవినీతి అక్రమాలకు పాల్పడలేదని ప్రభుత్వ చీఫ్ విప్ అన్నారు. తన ఎదుగుదల సహించలేని కొందరు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేయడం బాధ కలిగిస్తోందని ఆవేదన చెందారు. తాను తప్పు చేశానని ఎవరైనా ఆధారాలతో నిరూపిస్తే హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇక ముందు తనకెవరూ పుష్పగుచ్చాలు తీసుకురావద్దని, శాలువాలు కప్పొద్దని....ఆ డబ్బులతో పుస్తకాలు తీసుకువస్తే...పేద విద్యార్ధులకు అందించవచ్చని తెలిపారు.
- ఇదీ చూడండి : ఫాలో అవడం అంటే మరీ ఇలా చేయాలా...!