వరంగల్ అర్బన్ జిల్లా భీమాదేవరపల్లి మండలం ముల్కనూరులో శుక్రవారం రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వర్షాలకు వరద కాలువలకు గండిపడటం వల్ల వరి, పత్తి పంటలు నీట మునిగాయి.
రూ. లక్షలతో పెట్టుబడి పెట్టామని... తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో డ్రైనేజీలు నిండి వరద నీరు ఇళ్లలోకి చేరింది. పలు కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఇవీ చూడండి: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు