వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న 38 మంది అధ్యాపకులను వర్సిటీ పాలకమండలి తొలగించింది. దీన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తొమ్మిదేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులను కోరం లేదంటూ పాలకమండలి వీరి నోటిఫికేషన్ను రద్దు చేసింది.
అకారణంగా తొలగించిన అధ్యాపకులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కేయూ పరిపాలన భవనం ఎదుట ధర్నాకు దిగారు. ఇందువల్ల ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందన్నారు. పాలకమండలి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు