ETV Bharat / entertainment

'ఇకపై అలా పిలవకండి ప్లీజ్ '- ఫ్యాన్స్​కు కమల్ రిక్వెస్ట్! - KAMAL HAASAN TAG NAMES

ఫ్యాన్స్​కు కమల్ రిక్వెస్ట్- ఇకపై అలా పిలవద్దొంట!

Kamal Haasan Names
Kamal Haasan Names (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 12:01 PM IST

Kamal Haasan Tag Name : కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌ హాసన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తనను ఎలాంటి ట్యాగ్ నేమ్స్​తో పిలవొద్దని విజ్ఞప్తి చేశారు. ఆయనను కేవలం కమల్‌ లేదా కమల్‌ హాసన్‌ అనే పిలవమని తెలిపారు. సినీ లవర్స్​కు మరెన్నో అద్భుతమైన చిత్రాలు అందించాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఫ్యాన్స్​ను కోరారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా సోమవారం పోస్ట్‌ షేర్ చేశారు.

'నా పనిని మెచ్చి ఉలగనాయగన్ వంటి ఎన్నో బిరుదులను అందించినందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని. తోటి నటీనటులు, ప్రేక్షకులు, ఆత్మీయుల నుంచి వచ్చే ఇలాంటి ప్రశంసలు నా మనసుని తాకాయి. ఎవరి ఊహకు అందనిదే సినిమా. అందులో రోజూ ఏదో ఒకటి నేర్చుకునే నిత్య విద్యార్థిని. ఈ రంగంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను. ఇతర కళల మాదిరిగానే సినిమా కూడా అందరికీ చెందినది. అ సంఖ్యాక కళాకారులు, ప్రేక్షకుల సహకారం, సాంకేతిక నిపుణులు, విభిన్నమైన గొప్ప కథలకు ప్రతిబింబమే సినిమా'

'కళాకారుడు కంటే కళే గొప్పదని నా నమ్మకం. నేను ఎప్పటికీ స్థిరంగా ఉండాలని, నా లోపాలు గుర్తించి మెరుగుపరుచుకుంటూ నటుడిగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకుంటున్నా. ఎంతో ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నా. స్టార్‌ ట్యాగ్స్‌ను మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తా. నా అభిమానులు, సినీ ప్రముఖులు, మీడియా, తోటి భారతీయులంతా నన్ను కేవలం కమల్ హాసన్ లేదా కమల్ లేదా కె.హెచ్. అని పిలవాలని అభ్యర్థిస్తున్నా. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి బిరుదులతో మీరు నాపై చూపించిన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. నా మూలాలకు నేను కట్టుబడి ఉండాలని నటుడిగా బాధ్యత నిర్వర్తించాలని అనుకుంటున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ఆయన పేర్కొన్నారు.

నటీనటులు ట్యాగ్ నేమ్స్​ దూరంపెట్టడం ఇదేం తొలిసారి కాదు. తమిళ్ హీరో అజిత్‌ ఇప్పటికే ప్రకటించారు. తనని కేవలం అజిత్‌ కుమార్‌ లేదా అజిత్‌, ఏకే అని పిలవమని తెలిపారు. ఇక తెలుగులో నటుడు నాని కూడా తనని నేచురల్‌ స్టార్‌ అని కాకుండా నాని అని మాత్రమే పిలమన్నారు.

'మీరు ఓ అరుదైన రత్నం - ఇలాగే అద్భుతాలు సృష్టించాలి' - కమల్​కు శ్రుతి స్పెషల్ విషెస్!

'20 ఏళ్ల తర్వాత రోలెక్స్‌ కోసమే అలా చేశా - కమల్​హాసన్​ అంటే భయమేసింది!' - సూర్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.