ETV Bharat / spiritual

"రేపే శ్రీ మహా విష్ణువు మేల్కొనే ఉత్థాన ఏకాదశి - శ్రీహరి భక్తులు ఇలా చేయాలి"

- కార్తికమాస ఉత్థాన ఏకాదశికి ఎంతో విశిష్టత - చందన దీపంతో స్వామిని ఇలా పూజించాలి

Utthana Ekadashi 2024
Utthana Ekadashi 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 11:34 AM IST

Utthana Ekadashi 2024 : హిందూ సంప్రదాయాల్లో కార్తిక మాసానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నెలంతా విష్ణుమూర్తి, పరమేశ్వరుడి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ కార్తిక మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని 'ఉత్థాన ఏకాదశి' అంటారు. దీన్నే 'దేవుత్థాని ఏకాదశి' అని కూడా పిలుస్తారు. ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

పురాణ గాథల ప్రకారం.. ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి రోజున.. శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి.. సరిగ్గా 4 నెలల తర్వాత కార్తిక మాసం శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటాడట. అందుకే.. ఈ రోజున శ్రీహరిని పూజించేందుకు భక్తులు బారులు తీరుతారు. ఈ ఉత్థాన ఏకాదశి ఈ ఏడాది నవంబర్​ 12వ తేదీన వచ్చింది. ఉత్థాన ఏకాదశి శ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతారు. మరి ఈ రోజున శ్రీమహా విష్ణువు సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే.. గృహంలో చందన దీపాన్ని వెలిగించాలని ప్రముఖ జ్యోతిష్యుడు 'మాచిరాజు కిరణ్​కుమార్' చెబుతున్నారు. అలాగే ఆలయాల్లో నందా దీపాన్ని వెలిగించాలని అంటున్నారు. మరి ఈ దీపాలను ఎలా వెలిగించాలో ఈ కథనంలో తెలుసుకుందాం..

ఉత్థాన ఏకాదశి నాడు ఇలా చేయండి :

  • ముందుగా ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజగదిని సుందరంగా అలంకరించుకోవాలి.
  • తర్వాత లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
  • ఒకవేళ లక్ష్మీ నారాయణుల ఫొటో లేకపోతే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వేంకటేశ్వర స్వామి.. ఇలా విష్ణు స్వరూపానికి సంబంధించిన చిత్రపటానికి కుంకుమతో బొట్లు పెట్టాలి.
  • ఇప్పుడు ఆ ఫొటో వద్ద మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి.. మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఇలా ముందుగా సాధారణ దీపం వెలిగించిన తర్వాత చందన దీపాన్ని వెలిగించాలి.
  • చందన దీపం వెలిగించేందుకు.. పూజా గదిలో పీటను ఉంచాలి. దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్లెంను ఉంచాలి.
  • రాగి లేదా ఇత్తడి పళ్లెంలో మూడు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
  • తర్వాత తులసి చెట్టు కాండం లేదా వేర్ల నుంచి వచ్చిన చందనాన్ని కొద్దిగా తీసుకోవాలి. (ఈ చందనం బయట పూజా సామాగ్రి అమ్మే చోట లభిస్తుంది.)
  • ఇప్పుడు బియ్యప్పిండి, బెల్లం తురుము, ఆవుపాలు, చందనం కలిపి ఒక పిండి దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. దీనిని 'చందన దీపం' అంటారు.
  • ఇలా సిద్ధం చేసుకున్న చందన దీపాన్ని రాగి లేదా ఇత్తడి పళ్లెంలో ఉంచాలి. అలాగే పళ్లానికి మూడు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
  • ఆ చందన దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. లేదా ఆ చందన ప్రమిదలో ఆవు నెయ్యిలో ముంచిన 2 కుంభ వత్తులు ఉంచి దీపాన్ని వెలిగించవచ్చు.
  • ఇలా ఉత్థాన ఏకాదశి రోజున చందన దీపం వెలిగిస్తే శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో.. సిరి సంపదలు లభిస్తాయని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు.

సాయంకాలం ఆలయాల్లో 'నందా దీపం' వెలిగించే విధానం :

ఉత్థాన ఏకాదశి రోజున సాయంత్రం పూట విష్ణు సంబంధమైన ఆలయాల్లో నందా దీపం వెలిగిస్తే చాలా మంచిది. నందా దీపం అంటే.. ఎక్కువ సమయం వరకు దీపం కొండెక్కకుండా ఉంటే దానిని 'నందా దీపం' అని అంటారు. ఇందుకోసం..

  • సాయంత్రం పూట విష్ణు ఆలయాల్లో పెద్ద మట్టి ప్రమిదను ఉంచండి.
  • అందులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి రెండు లేదా మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి.
  • తర్వాత ఆ దీపం దగ్గర కొన్ని అవిసె పుష్పాలు ఉంచాలి.
  • ఒకవేళ ఈ పుష్పాలు అందుబాటులో లేకపోతే దీపం దగ్గర తమలపాకు ఉంచి అందులో కొన్ని నువ్వులు, కొద్దిగా ధాన్యం లేదా బియ్యం నైవేద్యంగా ఉంచాలని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు.
  • ఈ విధంగా ఉత్థాన ఏకాదశి రోజు.. విధివిధానాలు పాటించడం వల్ల శ్రీమహా విష్ణువు సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చని అంటున్నారు.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవి కూడా చదవండి :

కార్తిక సోమవారం వీటిల్లో ఏ ఒక్క పని చేసినా - శివుడి అనుగ్రహం తప్పకుండా పొందుతారట!

కార్తిక దీపం ఆ మూడు ప్రాంతాల్లో వెలిగించాలి - అవేంటో మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.