ETV Bharat / state

సరదాగా ఫోన్ పట్టాడు - నెమ్మదిగా బెట్టింగ్​కు బానిసయ్యాడు - చివరికి? - నర్సంపేట నేర వార్తలు

Student Suicide in Narsampet Online Betting : బెట్టింగ్.. సరదాగా మొదలుపెడితే.. అదే వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి అలవాటైతే బయటపడటం చాలా కష్టం. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఆన్​లైన్​ బెట్టింగ్​ల రాజ్యమే నడుస్తోందనే చెప్పాలి. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు మాత్రమై పరిమితమైన ఆన్​లైన్ బెట్టింగ్‌లు.. క్రమేణా పల్లెలకూ పాకాయి. అంతటితో ఆగకుండా విద్యార్థుల చదువులను నాశనం చేయడమే కాకుండా.. మధ్య తరగతి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి.

Student Suicide in Narsampet
Student Suicide
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2023, 11:39 AM IST

Student Suicide in Narsampet Online Betting : కాయ్ రాజా.. కాయ్.. వంద పెట్టండి వెయ్యి గెలుచుకెళ్లండి. ఒకప్పుడు ఎక్కడో సందుగొందుల్లో గుట్టుగా జరిగే ఈ బెట్టింగ్ వ్యవహారం.. ఇప్పుడు పలు యూట్యూబ్‌ ఛానళ్లు(YouTube Channels), వెబ్‌సైట్ల ద్వారానే కాకుండా మొబైల్‌ యాప్‌ల రూపంలోనూ అమాయకుల జేబులు కొడుతున్నాయి. ఆన్‌లైన్‌లో తారసపడుతూ వస్తున్న ప్రకటనలు క్షణాల వ్యవధిలో బ్యాంక్ ఖాతాలను (Bank accounts) ఖాళీ చేస్తున్నాయి. బెట్టింగ్​ల (Online Betting ) మోజులో పడి కొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటుంటే.. నష్టపోయిన మరికొందరు యువకులు.. అడ్డదారులు తొక్కుతూ మోసాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఈ తరహా మోసాలు సామాన్య ప్రజలను కలవర పెడుతున్నాయి.

Boy Suicide in Narsampet : నేటి ఆధునిక కాలంలో యువత ఆలోచన ఎలా ఉందంటే.. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌ బెట్టింగుల్లో పెట్టుబడులు పెడుతూ క్రమంగా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలా ఇబ్బందులు ఎదుర్కొనే వారిలో 18-40 ఏళ్ల వయసున్న వారే అధికంగా ఉంటున్నారు. స్నేహితుల మూలంగా, చరవాణి సహకారంతో చిన్నగా, సరదాగా ప్రారంభమైన ఈ మహమ్మారి.. ఇల్లుగుల్ల చేసేవరకు విడిచిపెట్టడం లేదు. వాటి నుంచి తేరుకునే సరికి పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. దీని ఫలితంగా వారిని నమ్ముకున్న కుటుంబీకులు దుఃఖ పీడితులు అవుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకుంది. ఆన్​లైన్ గేమ్​లో డబ్బులు పోగొట్టుకొని అప్పు చేసిన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్ ముఠా అరెస్టు.. వారి ఖాతాల్లోని రూ.24 కోట్లు సీజ్‌

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన మిట్టపల్లికి చెందిన బాలుడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుపన్నాడు. చరవాణిలో గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. రెండు లక్షలు వరకు యాప్స్​లో అప్పులు చేశాడు. ఈ క్రమంలో అప్పులు చేసిన వియషం తల్లిదండ్రులకు తెలుస్తుందన్న భయంతో.. బుధవారం రాత్రి నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆ విషయం ఇంట్లో తెలుస్తుందనే బాలుడు ఆత్మహత్య : మృతుడు లక్నేపల్లిలోని బిట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నాడని అతని తండ్రి తెలిపారు. ఆన్​లైన్ గేమ్స్​(Online Games)కి అలవాటు పడి దాదాపు రూ.2 లక్షలు అప్పు అయిందని తమకు తెలుస్తుందనే భయంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అన్నారు. మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం మార్చరీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్​లైన్​ బెట్టింగులకు బానిసై అప్పులపాలయ్యాడు.. కట్​ చేస్తే చివరకు..

Online Betting Games : ఆశతో ఆన్​లైన్ బెట్టింగులు.. అప్పుల కుప్పల్లో జీవితాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.