లాక్డౌన్లో పేదలు ఇబ్బంది పడకుండా పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు నిత్యవసర సరకులు అందిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఉషాకోయిల ప్రకాశ్ సుమారు 1500 కుటుంబాలకు కూరగాయలు, బియ్యం, మాస్కులు పంపిణీ చేశారు. స్థానిక ఎస్సై చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించారు. భీమదేవరపల్లి, ముల్కనూరు, వంగరల గ్రామాల్లో ప్రజలకు అందించారు. లౌక్డౌన్ దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడకుండా తనవంతు సహాయం చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: దయనీయ స్థితిలో వలస కూలీ... కడుపు ఖాళీ