ETV Bharat / state

'పచ్చని వాతావరణం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది' - ఆరో విడత హరితహారం తాజా వార్తలు

మియావాకి పద్ధతిలో నాటిన మొక్కలకు నీరు ఎక్కువగా అవసరం ఉండదని వరంగల్‌ నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు వెల్లడించారు. ఈ పద్ధతి ద్వారా ఏడాదిలోపే దట్టంగా పెరుగుతాయన్నారు. విద్యా సంస్థ నిట్‌లో నిర్వహించిన హరితహారానికి వరంగల్‌ సీపీ ప్రమోద్‌ కుమార్‌ హాజరయ్యారు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మొక్కలు పెంచడం ఆవశ్యకమని సీపీ తెలిపారు.

'పచ్చని వాతావరణం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది'

author img

By

Published : Jul 11, 2020, 12:52 PM IST

ఆరో విడత హరితహారంలో భాగంగా వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్‌లో అధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి ఎంజే అక్బర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మియావాకి పద్దతిలో దగ్గరగా వివిధ వృక్ష జాతులకు చెందిన మొక్కలను తక్కువ విస్తీర్ణంలో నాటారు.

ఈ పద్ధతిలో నాటిన మొక్కలకు నీరు ఎక్కువగా అవసరం ఉండదని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. ఈ పద్ధతి ద్వారా నాటిన మొక్కలు సంవత్సరం తిరిగేలోపు దట్టంగా పెరుగుతాయన్నారు. మియావాకి పద్దతిలో గత సంవత్సరం నాటిన మొక్కలను సీపీ సందర్శించారు. కేవలం 8 నెలల కాలంలోనే 6 ఫీట్లకు పైగా పెరిగిన మొక్కలు చిన్నపాటి అడివిని తలపించాయి.

ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మొక్కలు పెంచడం ఆవశ్యకమని సీపీ ప్రమోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. చుట్టూ పచ్చని వాతావరణం ఉండడం ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా.. ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. నిట్ పరిసరాలలో ఎక్కువ మొత్తంలో మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తున్న నిట్ అధికారులను సీపీ అభినందించారు.

ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.