రాష్ట్ర వ్యాాప్తంగా రోజురోజుకు కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ తరణంలో వరంగల్ నగరంలోని వ్యాపారస్థులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు.
నగరంలోని విశ్వకర్మ వీధి, పిన్న వారి వీధి, బట్టల బజారులోని నిత్యం వ్యాపార లావాదేవీలు జరిపే దుకాణాలు మూతపడ్డాయి. దీనితో ప్రధాన వీధులన్నీ బోసిపోయాయి. క్రయవిక్రయాలు జరిపేవారు లేక రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. వైరస్ కట్టడిలో భాగంగా తమవంతు బాధ్యతగా దుకాణాలు మూసేసినట్టు యజమానులు తెలిపారు.
ఇదీ చదవండి: హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు