వరంగల్ అర్బన్ జిల్లాలో శివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా సాగాయి. జిల్లాలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఐనవోలులోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎత్తు బోనాలు, మల్లన్న పట్నాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం జరిగిన పెద్దపట్నం వైభవంగా సాగింది. పెద్దపట్నం బండారి తీసుకునేందుకు భక్తులు పోటీపడగా... స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. చిటికెడు బండారి తీసుకుంటే కోరుకున్న కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాగా... బారికేడ్లు తోసుకుని మరీ పోటెత్తారు.