వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి భక్తజనం పోటెత్తారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది తరలిరానున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు. బోనం వండి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. ఐనవోలు మన్నన్న స్వామిని లక్షలాది మంది ఆరాధ్యదైవంగా కొలుస్తారు.
ఇదీ చూడండి: ఇళ్లు చేరాలంటే ఈ ఫీట్లు తప్పవు మరి