వరంగల్‌లో ఆర్టీసీ కార్మికుల ఏడో రోజు సమ్మె కొనసాగుతోంది. మొత్తం 9 డిపోల పరిధిలోని బస్సులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడిపిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 942 బస్సులకు.. 604 రోడ్డెక్కినట్లు అధికారులు తెలిపారు. దసరా పండుగకు వచ్చిన వారంతా తిరుగుపయనమవ్వడం వల్ల బస్టాండ్లలో రద్దీ నెలకొంది. వరంగల్-హైదరాబాద్ రూట్లో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. సమ్మెను మరింత ఉద్ధృతం చేసేందుకు కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు పబ్లిక్ గార్డెన్స్‌లో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. స్థానిక భాజపా నేతలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు.
ఇవీచూడండి: రేపు అన్ని డిపోల వద్ద మౌనపోరాటం