రంగారెడ్డి జిల్లా ఆమనగల్ సమీపంలోని మేడిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారును లారీ ఢీ కొట్టిన ఘటనలో కాజీపేటకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు మృత్యువాత పడ్డారు. వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్, అతని భార్య విజయలక్ష్మి, కొడుకు శాంతన్, బావ రాజు, అక్క పద్మజతో కలిసి శ్రీశైలం దైవ దర్శనం చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో కాజీపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీచూడండి: వ్యవసాయబావిలో పడి వ్యక్తి మృతి