వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో కాజీపేటకు చెందిన రైల్వే ఉద్యోగి కుమార్ స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు.
కుమార్ స్వామి.. హన్మకొండ నుంచి కాజీపేటకు వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్తతో నడిపి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.